24-08-2025 09:24:31 AM
హైదరాబాద్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) అంతిమయాత్రను ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి మార్చురీలో ఉన్న సురవరం భౌతికకాయం.. ఈ ఉదయం అభిమానుల సందర్శనార్థం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ కు తరలించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మఖ్దూం భవన్ లోనే సురవరం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మఖ్దూం భవన్ నుంచి గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయాన్ని అప్పగించనున్నారు. కాగా, సురవరం సుధాకర్ రెడ్డి ఈనెల 22న గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిపిందే.