13 April, 2026 | 10:53 PM

అత్తాపూర్‌లో జింక మాంసం కలకలం

30-12-2025 02:10 PM

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్‌లో(Attapur) జింక మాంసం అమ్మకం కలకలం రేగింది. సమాచారం అందుకున్న  రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు జింక మాంసం(Deer Meat Sale ) అమ్ముతుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై వైల్డ్‌లైఫ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 15 కిలోల జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.