30-12-2025 03:29:24 PM
చిల్లర బుద్ధి మానుకోవాలి: మాణిక్ యాదవ్ ఫైర్
అమీన్పూర్: అమీన్పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని నూతన సంవత్సరం, సంక్రాత్రి సంబంధించిన ఫ్లెక్సీలు చేయించి దుండగులపై బీఆర్‌ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్ పూర్ కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ సర్కిల్ లో న్యూ ఇయర్ కు సంబంధించిన మా ఫ్లెక్సీలు చించే సంస్కృతి మానుకోవాలని తీవ్రంగా మండిపడ్డారు.
ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే చాలు కొందరు పనిగట్టుకుని వాటిని చించేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని, తమ సహనాన్ని పరీక్షించడం సరికాదని హెచ్చరించారు. ఇలాగే కొనసాగితే తాము కూడా ఫ్లెక్సీలు చించడం మొదలుపెడితే ప్రత్యర్థుల ఫ్లెక్సీలు కూడా మిగలవని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదగాలనుకునేవారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా నిరూపించుకోవాలని ఆయన సూచించారు.