calender_icon.png 30 December, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీటీసీ కిషన్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్

30-12-2025 03:21:28 PM

హైదరాబాద్:  మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ కస్టడీ(DTC Kishan) కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. డీటీసీ కిషన్ ను వారంపాటు కస్టడీకి కోరుతూ ఏసీబీ(Anti Corruption Bureau) కోర్టులో అధికారులు పిటిషన్ వేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కిషన్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కిషన్ పేరిట వందల కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. మరింత సమాచారం రాబట్టేందుకు ఏసీబీ కిషన్ ను కస్టడీ కోరింది.