calender_icon.png 30 December, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ అమ్ముతున్న యువతి అరెస్ట్

30-12-2025 03:56:08 PM

హైదరాబాద్:  గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న యువతి అరెస్ట్ అయింది. డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్(Banjara Hills)కు చెందిన హస్సా అనే యువతిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గోవాలో నైజీరియన్స్ వద్ద డ్రగ్స్ కొనుగోలు(Buying drugs) చేసినట్లు గుర్తించారు. 2025 మార్చి నుంచి హస్సా పలుమార్లు గోవాకు వెళ్లినట్లు విచారణలో తెలింది. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఎండీఎంఏ విక్రయించినట్లు గుర్తించారు. డ్రగ్స్ కేసులో గతంలోనే అరెస్టు అయిన హస్సా బెయిల్ పై బయటకు వచ్చింది.