12-12-2025 08:31:37 PM
ప్రొఫెసర్ ఎం. కోదండరాం
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో శుక్రవారం "ఇండియా @ 2047 రియలైజింగ్ ది విజన్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ రిపబ్లిక్" అనే అంశంపై తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిజిసిహెచ్ఈ) హైదరాబాద్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసిఎస్ఎస్ఆర్) హైదరాబాద్ వారి సహకారంతో, కళాశాల రాజనీతి శాస్త్రవిభాగం నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ ఎం.కోదండరాం, విశిష్ట అతిధిగా ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్ ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ ఫైట్ ఎడ్యుకేషన్ నెంబర్ డి.రమేష్ పట్నాయక్, గౌరవ అతిథిగా పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ అండ్ కన్సల్టెంట్ ఎట్ ది పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, సెమినార్ కన్వీనర్ డాక్టర్ సామిల్ ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... భారత ప్రభుత్వ సంపూర్ణ ప్రజాస్వామ్యం సామాజిక న్యాయాన్ని, ఆర్థిక సమానత్వాన్ని కల్పించినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు.
కళాశాలలోని ఈసదస్సులు అనుభవైకావిజ్ఞానాన్ని అందించి విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. హక్కులను మాత్రమే కాకుండా బాధ్యతలు స్వీకరించాలని, సామాజిక ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. జాతీయ సదస్సుకు 46 పరిశోధనా పత్రాలు రావడం నిజంగా గర్వించదగినదని, సదస్సులో మేధావులు, అధ్యాపకులు, పరిశోధకులు, ఔత్సాహికులు, విద్యార్థులు అనేక విషయాలను క్షుణ్ణంగా వివరించారు.