calender_icon.png 12 December, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై చర్యలు

12-12-2025 08:28:34 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం, మండల పరిధిలోని పోలింగ్ బూతుల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపడుతున్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీలకు గాను 7 జీపీలు ఏకగ్రీవం కావడంతో మిగతా 21 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొత్తం 161 వార్డు స్థానాలకు 161 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు పెయింట్ బూతు నంబర్లను గోడలపై రాయించారు. వసతులపై ఏర్పాట్లు చేస్తున్నారు.