calender_icon.png 12 December, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు సభ్యులకు తెలియకుండానే ఉప సర్పంచ్ ఎన్నిక

12-12-2025 08:37:00 PM

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులు

తాండూరు,(విజయక్రాంతి): వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఎన్నికల అధికారులు  నియమావళిని ముల్లంగించి ఓ గ్రామానికి ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే అధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని మెజారిటీ వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గ్రామపంచాయతీలో జరిగింది. మెజార్టీ వార్డు సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామపంచాయతీలో 9 మంది వార్డు సభ్యులు ఉండగా నేడు కేవలం నలుగురి సమక్షంలోనే గ్రామ ఉప సర్పంచ్ పదవిని అధికారులు ఎంపిక చేశారని తెలిపారు.

మిగతా 5 మందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉప సర్పంచ్ పదవి ఎంపిక ఎలా చేస్తారని సంబంధిత అధికారులను ప్రశ్నించగా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని విజయం సాధించిన మెజారిటీ వార్డు సభ్యులు అంటున్నారు. ఈ విషయమై ఎంపీడీవోకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఉపసర్పంచ్ ని ఎన్నుకున్న అధికారులపై తగు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కోరుతున్నారు.