12-12-2025 08:16:19 PM
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి
మాజీ సర్పంచ్ సాముల వెంకట్ రెడ్డి
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల పరిధిలోనీ సర్వారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు కన్నెగుండ్ల ఆంజనేయులు సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ సాముల వెంకట్ రెడ్డి అన్నారు. మండలంలోని సర్వారం గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వారం బస్ స్టాండ్ సెంటర్లో ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కన్నె గుండ్ల ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలను కొనియాడారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న మహానీయుడని గుర్తు చేసుకున్నారు.ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరారు.పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.