calender_icon.png 12 May, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గగనతల దాడులను పసిగట్టి నిలువరించాం: వైస్ అడ్మిరల్ ప్రమోద్

12-05-2025 04:32:35 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్ పై భారత్ సైనికులు జరిగిపిన దాడుల వీడియోలను దేశ రక్షణ శాఖ అధికారులు ప్రదర్శించారు. పాక్ లోని నూర్ఖాన్, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ లపై జరిగిన దాడి దృశ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్ మాట్లాడుతూ... బహుళ సెన్సార్లు, ఇన్‌పుట్‌లను సమర్థవంతంగా ఉపయోగించి, విస్తృత శ్రేణి లక్ష్యాలను నిర్ధారించడానికి బెదిరింపులు ఉద్భవించినప్పుడు, వ్యక్తమైనప్పుడు వాటిని తగ్గించడానికి, తటస్థీకరించడానికి మేము నిరంతర నిఘాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవన్నీ సమగ్రమైన, ప్రభావవంతమైన లేయర్డ్ ఫ్లీట్ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం కింద నిర్వహించబడతాయని, డ్రోన్‌లు, హై-స్పీడ్ క్షిపణులు, విమానాలు, యుద్ధ విమానాలు రెండింటిని అందిస్తుందన్నారు. నౌకాదళం పటిష్ట నిఘాతో దాడులను తిప్పికొట్టిందని, గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని ప్రమోద్ వెల్లడించారు. ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, రాడార్లు వినియోగించామని, ఫ్టీట్, ఎయిర్ డిఫెన్స్ ను సమర్థంగా వినియోగించి నౌకాదళ అడ్వాన్స్ రాడార్లు ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ వివరించారు.

మిగ్ లు, హెలికాప్టర్ల ద్వారా పాక్ నుంచి వచ్చిన వాటిని గుర్తించి, కేరియర్ బ్యాటర్ గ్రూప్ సమర్థంగా నిఘా పెట్టిందన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రుసేనల విమానాలను దగ్గరకు రాకుండా అడ్డుకున్నామని, త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయని స్పష్టం చేశారు. మన స్వదేశీ ప్రతిస్పందన దాడి వ్యవస్థ చాలా బలమైందని, సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.