calender_icon.png 12 May, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యానికి కాంటాలు నిర్వహించాలి

12-05-2025 04:44:52 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చాలామంది రైతులకు చెందిన ధాన్యాన్ని కాంటా వేయకుండా జాప్యం చేస్తున్నారని సిపిఎం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి నాయకులు నిరసన నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న మాట్లాడుతూ.. నెల రోజుల నుండి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి బస్తాలు, అందుబాటులో లేక, కొందరు, బస్తాలు నింపి తూకం నిరీక్షిస్తున్నారని మరికొందరు ధాన్యం గోదాములకు తరలించడానికి లారీలు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

మిగిలిన వారికి గన్ని బస్తాలు ఇచ్చి త్వరగా కాటాలు వేసి, ధాన్యం గోదాములకు తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.  ఈ విషయంపై కేసముద్రం తహసిల్దార్ కు ఫోన్ చేసి సమస్యను వివరించగా,  లారీలు పంపిస్తావని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో తులసి మొగ్గ శేఖర్, రైతులు ఐలయ్య, వల్లాల అంజయ్య, దొంతర బోయిన రమేష్, కాలే శ్రీనివాస్, వాలేరు కొమురమ్మ, తదితరులు పాల్గొన్నారు.