12-05-2025 03:55:45 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్ లక్ష్యాన్ని ఛేదించామని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) జనరల్ రాజీవ్ ఘాయ్(DGMO Lieutenant General Rajiv Ghai) తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ... గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం తీరులో మార్పు వచ్చిందని, ఉగ్రవాదులు అమాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నారని రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు. మన ఎయిర్‌ఫీల్డ్‌లు, లాజిస్టిక్‌లను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ క్రికెట్ స్టోరీ చెప్పారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారని, అతను తనకు ఇష్టమైన వారిలో ఒకరని వెల్లడించారు.
1970 లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన యాషెస్ సిరీస్ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను నాశనం చేశారన్నారు. ఆపై ఆస్ట్రేలియాలో ఓ నానుడి వచ్చిందని, యాషెస్ టు యాషెస్, డస్ట్ టు డస్ట్, ఇఫ్ థామ్మో డోంట్ గెట్ యూ, లిల్లీ మస్ట్ అన్న ప్రావర్స్ పట్టిందన్నారు. అంటే ఒకవేళ జెఫ్ థాంప్సన్‌ను తప్పించుకున్నా.. డెన్నిస్ లిల్లీకి బ్యాటర్ చిక్కాల్సిందే అన్న రీతిలో ఆ స్టేట్మెంట్ ఉంది. ఈ అంశాన్ని పరిశీలిస్తే, నేను చెప్పేది మీకు అర్థం అవుతుందన్నారు. మీరు అన్ని పొరలను దాటినప్పటికీ, ఈ గ్రిడ్ వ్యవస్థ ఒక పొర మిమ్మల్ని తాకుతుందని హెచ్చరించారు.