12-05-2025 03:22:16 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్ పై దేశ రక్షణశాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. పాకిస్థాన్, పీవోకేలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామని, పీవోకే లో ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ చేపట్టి యుద్ధం చేసిందని ఎ.కె.భారతి పేర్కొన్నారు. పాకిస్థాన్ భూభాగంలో జరిగిన నష్ట్రానికి పాక్ ఆర్మీదే బాధ్యత అని, ఉగ్రవాదులపై భారత్ పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామని ఎ.కె.భారతి తెలిపారు.
దీంతో పాకిస్తాన్ సామన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదని, పాక్ వైపు నుంచి వస్తున్న దాడులను సమర్థంగా తిప్పింకొట్టామన్నారు. భారత సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టామని ఆయన వెల్లడించారు. స్వదేశీ తయారీ ఆకాశ్ ను సమర్థంగా వినియోగించి చైనా తయారీ పీఎల్-15 క్షిపణిని నేలకూల్చామని, పాకిస్థాన్ కు చెందిన అనేక డ్రోన్లు, మిసైల్లను కూల్చివేశామని ఎయిర్ మార్షల్ పేర్కొన్నారు.