20-09-2025 12:15:13 AM
వికారాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి); వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ఓ వస్త్ర దుకాణం దసరా ఆఫర్‌ను ప్రకటించడంతో జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు. రూ.5కే చొక్కా ఇస్తామని యజమాని తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేయడంతో అది చూసిన ప్రజలు శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల నుంచి క్యూ లైన్‌లో నిలబడ్డారు. జనాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో సదరు షాప్ యజమాని దుకాణం తెరిచేందుకు నాన్న తండాలు పడాల్సి వచ్చింది. అయితే క్యూలైన్‌లో నిల్చొన్న సగం మందికి ఆఫర్ ధరకు చొక్కలు ఇచ్చి, తర్వాత నిలిపిసినట్టు తెలిసింది.