calender_icon.png 24 January, 2026 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమశిల పర్యటనలో డిగ్రీ విద్యార్థులు

24-01-2026 12:00:00 AM

నదీతీరంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు

నాగర్ కర్నూల్, జనవరి 23 (విజయక్రాంతి): తెలంగాణ నేషనల్ గ్రీన్ కాప్స్, కళాశాల ఏకో క్లబ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పర్యాటక కేంద్రం సోమశిలను ఫీల్ ట్రిప్లో భాగంగా శుక్రవారం సందర్శించారు. ముందుగా కొల్లాపూర్ మండలం ఎల్లూరు కేఎల్‌ఐ లిఫ్ట్1ను సందర్శించి, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి సాగునీటి కోసం నీటిని లిఫ్ట్ చేసే విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. సోమశిల పర్యాటక ప్రాంతంలో టూరిజం లాంచీలో ప్రయాణించిన విద్యార్థులు నది తీర ప్రాంతంలో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. పర్యాటకులకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలంటూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.