24-01-2026 12:00:00 AM
ఎవరికి వారుగా సర్వేలు
కరీంనగర్, జనవరి 23 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పెద్దలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో తలమునకలవుతున్నారు. నిన్నటి వరకు ఒక పార్టీకి జై కొట్టిన వారు టి కెట్ల కోసం కండువాలు మార్చుతున్నారు.
ఒక బి ఆర్ ఎస్ ప్రతినిధి భగత్ నగర్ లో ఉండే ఒక విశ్రాంతి ఉద్యోగి ఇంటికెళ్లి పా ర్టీలో చేరితే టికెట్ ఖాయమని చెప్పి వచ్చిన తెల్లారే కాంగ్రెస్ లో చేరడం, ఒక కాంగ్రెస్ పెద్దాయన బి ఆర్ ఎస్ నాయకుని ఇంటికే వెళ్లి కండువా కప్పగా గంట వ్యవధిలోనే నే ను బి ఆర్ ఎస్ లొనే ఉన్నానని సదరు నా యకుడు ప్రకటించడం లాంటి సంఘటనలు గల్లీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపా లిటీలు, రెండు కార్పొరేషన్ ల పరిధిలో అభ్యర్థుల ఎంపిక, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చలు, పో టీకి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చిన వార్డుల్లో ఆశావహులను బుజ్జగించడం, వా రిని పోటీ నుంచి తప్పించే దిశగా ఆయా పా ర్టీల ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. పోటీకి సిద్ధమైన ఆశాశహులు బీఫామ్ దక్కించుకోవడానికి పార్టీల పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
గుర్తులతో ప్రమేయం లేకుండా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో హోరా హోరీగా తలపడిన అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీలు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల గుర్తులతో జరిగేవి కనుక ఎన్నికల్లో పట్టు సాధించడానికి పకడ్బందీగా వ్యవహరిస్తుండటం తో ఆశావహుల్లో టికెట్ టెన్షన్ పట్టుకుంది. పార్టీల పెద్దలు ఎవరి వైపు కరుణచూపుతారనే ఆసక్తి పెరిగింది. మున్సిపాలిటీలో కాం గ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు సర్వేలపై దృష్టిపెట్టాయి. వార్డులు, డివిజన్ల వారీగా బృందాలను నియమించి సర్వేలు చేయిస్తున్నారు.
ఇప్పటికే సర్వేలతో అంచనాకు వచ్చిన ఆయా పార్టీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన అభ్యర్థులను బరిలో దింపే విధంగా సిద్ధమవు తున్నారు. ఈ క్రమంలోనే జంప్ జిలానీలను ప్రోత్సహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్టులపైన ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రధాన పార్టీలతో పాటు ఎం ఐ ఎం పార్టీ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.