calender_icon.png 24 January, 2026 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ చూపంతా కరీంనగర్ కార్పొరేషన్ వైపే

24-01-2026 12:00:00 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, జనవరి 23 (విజయ క్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఈఎన్ గార్డెన్స్ లో బీజేపీ నేతల సమావేశం నిర్వహించారు. 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి, 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తన అనుచరులతో కలిసి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఈసారి బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారిని సాదరంగా ఆహ్వానించడంతోపాటు కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గెలిచే అవకాశమున్న చోట పార్టీ కార్యకర్తలకే టిక్కెట్లు ఇస్తామని పునరుద్ఘాటించారు. బీజేపీలో పార్టీ నిర్ణయమే ఫైనల్ అని, పార్టీ కంటే పెద్దోళ్లు ఎవరూ లేరని, ఎవరున్నా లేకు న్నా పార్టీ కొనసాగుతుందన్నారు. కరీంనగర్ మేయర్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, అందుకోసం దేనికైనా తెగించడానికి సిద్దపడదామని చెప్పారు. ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం తాకిడి ఎక్కువగా ఉందని, ఒక్కో డివిజన్ కు 20 మందికిపైగా టిక్కెట్ ఆశిస్తున్నారని చెప్పారు.

గెలిచే అవకాశమున్న చోట పాత కార్యకర్తలకే తప్పనిసరిగా టిక్కెట్లు ఇస్తామని, కష్టపడినా గెలిచే అవకాశం లేనిచోట ప్రత్యామ్నాయం చూస్తామని తెలిపారు. వివిధ సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని, టిక్కెట్లు రానివారిని సముదాయించాల్సిన బాధ్యత జోన్ అధ్యక్షులు, పార్టీ నేతలపైనే ఉందని చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలోకి వచ్చినా వాళ్లకే టిక్కెట్లు గ్యారంటీగా ఇస్తామనే అవకాశమే లేదని, అంతిమంగా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయ ణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లరమేశ్, సీనియర్ నేతలు ఓదేలు, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్, డాక్టర్ పుల్లెల పవన్, బోయినిపల్లి ప్రవీణ్, గు జ్జ క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

వసంత పంచమి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్

ముకరంపుర, జనవరి 23 (విజయ క్రాంతి): నగరంలోని మహా శక్తి దేవాలయంలో శుక్రవా రం నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. హోమం నిర్వహించిన అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పాల్గొన్నారు.