11-01-2026 12:00:00 AM
నవీ ముంబై, జనవరి 10 : డబ్ల్యూపీఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై అనూహ్యంగా ఓడిపోయిన ముంబై రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఓపెనర్లు త్వరగానే ఔటైనప్పటకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 42 బంతుల్లోనే 74 (8 ఫోర్లు, 3 సిక్సర్లు), నాట్ సీవర్ బ్రంట్ 46 బంతుల్లో 70 (13 ఫోర్లు) పరుగులతో రాణించారు.
చివర్లో నికోలా క్యారీ 12 బం తుల్లోనే 21 రన్స్‌తో మెరుపులు మెరిపించింది. ఛేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే తడబడింది. కేవలం 46 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. షెఫాలీ వర్మ(8), లిజెల్లీ(10), వోల్వార్ట్ (9), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (1), మారిజెన్ కాప్(10) నిరాశపరిచారు. తర్వాత బ్యాటర్లలో చినెల్లీ హెన్రీ తప్పి స్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు. ఫలితంగా ఢిల్లీ 145 పరుగులకే ఆలౌటైంది.