calender_icon.png 12 January, 2026 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్కంఠపోరులో గుజరాత్ గెలుపు

11-01-2026 12:00:00 AM

పోరాడి ఓడిన యూపీ వారియర్స్

నవీ ముంబై, జనవరి 10 : వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌ను గుజరాత్ జెయింట్స్ విజయంతో ఆరంభించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్‌పై 10 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసిం ది. గుజరాత్ కెప్టెన్ గార్డనర్ కేవలం 41 బం తుల్లోనే 65 (6 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో అదరగొట్టింది. అలాగే అరంగేట్రంలో నే అనుష్క శర్మ కూడా మెరుపులు మెరిపించింది.

అనుష్క 44 (30 బంతుల్లో 7 ఫోర్లు) రన్స్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్‌కు ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ మె రుపు బ్యాటింగ్‌తో ఆశలు రేకెత్తించింది. ఆమె కేవలం 40 బంతుల్లోనే 78 (8 ఫోర్లు, 5 సిక్సర్లు) రన్స్ చేయగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (30), శ్వేత వరహాత్(25), ఆశా శోభన (27 నాటౌట్) కూడా ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. గుజరాత్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి యూపీని కట్టడి చేశారు. ఫలితంగా యూపీ వారియర్స్ 197 పరుగులే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్ 2, సోఫీ డివైన్ 2, జార్జి యా వరీహమ్ 2 వికెట్లు పడగొట్టారు.