calender_icon.png 4 December, 2024 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టిస్తుండ్రు

06-11-2024 04:05:38 PM

టిఆర్ఎస్ నేతల తీరు సరికాదు 

రైతు వేదికలో వరి కోనగిరి కేంద్రంలో ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఎదిర, హన్వాడ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

దివిటిపల్లి రైతు వేదిక వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వారు దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు చేస్తూ, రైతును గోసకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇక వారి ఆగడాలు సాగవని, ఎవరు కూడా బిఆర్ఎస్ నాయకుల మాటలు విన వద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ అమలు చేసి, రైతును రుణ విముక్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. 

రైతులకు మద్దతు ధరను కల్పిస్తున్నామని, మొట్టమొదటి సారిగా రూ 500ల బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని, చివరి గింజ వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసిన 48 గంటలలోపే రైతు అకౌంట్ లోకి డబ్బులు జమచేస్తామని ఆయన స్పష్టం చేశారు. దళారులను నమ్మి మోస పోరాదని ఆయన రైతులకు సూచించారు. రైతులకు సేవ చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి రైతులకు అందరికీ  ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, రైతులందరూ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం అమ్మే విధంగా రైతులను చైతన్యం చేయాల్సిన  బాధ్యత డైరెక్టర్ల మీద ఉందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసిబి వైస్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కౌన్సిలర్లు హన్మంతు, ఖాజా పాషా, చిన్న, నాయకులు శివశంకర్, జె.చంద్రశేఖర్, చెర్ల శ్రీనివాస్, అనుపటి ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్, శివప్రసాద్ రెడ్డి, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.