హుజురాబాద్ లో కదలని ప్రగతి రథ చక్రాలు
తెల్లవారుజాము నుంచే అడ్డుకున్న కార్మికులు
బలవంతంగా బస్సులు నడిపే ప్రయత్నం చేసిన పోలీసులు
పోలీసులు, నిరసన కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం
హుజురాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు బంద్ కు పిలుపునివ్వగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఆర్టీసీ బస్సులు డిపో కే పరిమితమయ్యాయి. బుధవారంఉదయం నుంచే కార్మికులు డిపో కు చేరుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు డిపోకు చేరుకొని బస్సులను బలవంతంగా పంపించెందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులకు, పోలీసులులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ... ప్రభుత్వం లో విలీనం చేసేంతవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్మికులకు అందాల్సిన ఫలాలు దక్కకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరో వైపు బస్టాండ్ లో ప్రయాణీకులు బస్ ల కోసం పడిగాపులు కాస్తున్నారు. బస్ లు లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






