calender_icon.png 19 January, 2026 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 ఏళ్లు నిండిన వారు ఓటర్ నమోదు చేసుకోవాలి

09-11-2024 02:54:27 PM

కామారెడ్డి (విజయక్రాంతి): 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 79, 81 లను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నేడు, రేపు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అర్హత కలిగిన వారు వారి పేరును ఓటరు జాబితాల్లో నమోదు చేసుకోవాలని అన్నారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని వారిని అర్హత ఉన్న ప్రతీ ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ ధర్మారెడ్డి, తదితరులు ఉన్నారు.