calender_icon.png 29 August, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం

16-12-2024 12:25:56 PM

హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారద్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం.. దశలవారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లలో ఒక్క డీఎస్సీ, గ్రూప్-1 పరీక్షను గత ప్రభుత్వం నిర్వహించలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.