16-12-2024 11:23:17 AM
ఇబ్రహీంపట్నం,(విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ రోడ్డు సమీపంలోని ఓ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 10 టన్నుల రేషన్ బియ్యాన్ని సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. పేదల బియ్యం పక్కదారి పడుతున్నది. నిఘా కరువై దందా జోరుగా నడుస్తున్నది. పోలీస్ యంత్రాంగం తరచూ పట్టుకుంటున్నా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తేనే దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.