16-12-2024 12:44:28 PM
హైదరాబాద్: అసెంబ్లీలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై కాంగ్రెస్ సరైన సమాధానం ఇవ్వకుండా, సభను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. లగచర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. అసెంబ్లీ వద్ద ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు చేశారు. రైతులకు బేడీలా.. సిగ్గు సిగ్గు అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, శాసనసభలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయితీలపై కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను, అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా హరీశ్ రావు తిప్పి కొట్టారు. అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు.. ఇదేనా వాళ్లు నేర్చుకున్నది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హరీశ్ సెటైర్ వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవడంపై సీతక్కకు మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు.