కిష్టాపురంలో భగ్గుమన్న పాత కక్షలు
దాడికి దిగిన ఇరువర్గాలు
చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు
ముగ్గురికి తీవ్ర గాయాలు
చింతలపాలెం, మే 28: మండలంలోని కిష్టాపురంలో బక్రీద్ పండగ రోజు పాత కక్షలు భగ్గు మన్నాయి ఇరు వర్గాల వాళ్ళు రాళ్లతో దాడులకు తెగబడటంతో కిష్టాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణ లో ముగ్గురు తీవ్రంగా గాయపడగా ఒక ఇల్లు, బైక్ ధ్వంసమయ్యాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం గ్రామంలోని ఇస్మాయిల్, దాదాబుడే వర్గాల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఇస్మాయిల్ వర్గానికి చెందిన షరీఫ్ అనే వ్యక్తి ట్రాక్ట్ప వ్య వసాయ పనులకు బయలుదేరాడు. దారిలో ద్విచక్ర వాహనంపై ఉన్నదాదాబుడే వర్గానికి చెందిన ఉస్మాన్, చెపరాసిలను షరీఫ్ తన ట్రాక్టర్తో బలంగా ఢీకొట్టడంతో వివాదం రాజుకుంది. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక పాత కక్షలతోనే కావాలని ఢీకొట్టారా అనే వాగ్వాదం క్షణాల్లోనే పెద్ద గొడవకు దారితీసింది.
పాత కోపాలను మనసులో ఉంచుకు న్న ఇరువర్గాల వారు భారీగా గుమిగూడి పరస్పరం దాడులకు దిగారు. కళ్లెదుటే కనిపిస్తున్న ఇళ్లను, వాహనాలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చింతలపాలెం ఎస్త్స్ర పరమేష్, మేళ్లచెరువు ఎస్త్స్ర నవీన్ కుమార్ తమ బలగాలతో ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టి పరిస్థితిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పోలీసులు సరైన సమయానికి ఎంట్రీ ఇవ్వకపోతే ప్రాణనష్టం జరిగేదని గ్రామస్థుల చెబుతున్నారు. ప్రస్తుతం కిష్టాపురం గ్రామం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘర్షణపై చింతలపాలెం ఎస్త్స్ర పరమేష్ స్పంది స్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. గొడవకు కారణమైన ఇరువర్గాల వ్యక్తులను గుర్తించి, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.






