calender_icon.png 8 October, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ విగ్ర‌హం ధ్వంసం చేయ‌డం హేయ‌మైన చ‌ర్య‌

08-10-2025 08:43:20 PM

న‌ర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి..

వెల్దుర్తి: వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో అక్టోబర్ 2న జరిగిన గాంధీజీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కాపాడుతున్న నాయకులు ఎవరని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ‌వారం యశ్వంత‌రావుపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలతో సత్కరించి మాట్లాడారు. గాంధీ విగ్ర‌హాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయటం ముమ్మాటికి హేయమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీ విగ్రహం ధ్వంసం జరిగితే  కొన్ని పార్టీల నాయకులు కనీసం నోరు ఎత్తటం లేద‌ని ఆరోపించారు. ఓ పార్టీకి చెందిన కొందరు జిల్లా నాయకులు పోలీస్ స్టేషన్లో కూర్చొని దుండ‌గుల‌కు మద్దతుగా ఉండడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక‌ముందు ఇటువంటి సంఘటన జరగకుండా గ్రామంలోని ప్రజలు, యువకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మండల మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నాయకుడు నరసింహారెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.