calender_icon.png 8 October, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొల్ల స్వచ్ఛందసేవా సంస్థ సేవలు అమోఘం

08-10-2025 08:37:15 PM

సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు..

మణుగూరు (విజయక్రాంతి): ఏజెన్సీలోని ప్రజలకు మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని సర్కిల్ ఇన్స్పెక్టర్ పాటి నాగబాబు అన్నారు. బుధవారం జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో సేవాసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిక్షనరీల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు డిక్షనరీ ముఖ్యమని, ప్రతిభా వంతులైన విద్యార్థులను అభినందించడం వారి కృషి, పట్టుదల, అంకితభావానికి  గుర్తింపుగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎంఈఓ స్వర్ణజ్యోతి, సేవా సంస్థ గౌరవాధ్యక్షులు గంగాధర వీరయ్య, ఉపేంద్రరావు, బీరం సుధాకర్ రెడ్డి షహనాజా బేగం, జిల్లా ఆర్గనైజర్ కొలిచలం గీత, తమ్మిశెట్టి సాంబశివరావు, నిమ్మనగోటి వీరయ్య, అనిత, మల్లయ్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు.