ఆసక్తికర కథతో..
‘మంగళసూత్రం’ చిత్రం 1966 మే 19 న విడుదలైంది. ఈ చిత్రానికి అరుణాచలం స్టూడియో స్ బ్యానర్‌లో ఏకే వేలన్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్‌టీ రామారావు, దేవిక ప్రధాన పాత్రలలో నటించారు. ప్రసిద్ధ న్యాయవా ది అయిన జోగారావు, పార్వతి దంపతులకు రాజు (ఎన్ టి రామారావు), శంకర్ అనే ఇద్దరు పిల్లలు. జోగిరావు కుటుంబం సంతోషకరమైన జీవితాన్ని గడుపు తూ ఉంటుంది. ఒకసారి రాజు తమ గ్రామానికి వెళ్లినపుడు అక్కడ శాంత (దేవిక) తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. రాజు గ్రామానికి తిరిగి వచ్చిన సమయంలో పార్వతి.. శాంతతో అతని పెళ్ళి నిశ్చయం చేస్తుంది. అయితే తన తల్లి పెళ్లి నిశ్చయం చేసినది తన ప్రేయసితోనేనని రాజుకు తెలియక దానిని తిరస్కరిస్తాడు. తన తండ్రి జోగారావు సహాయంతో రాజు పెళ్లి సమయంలో ఇంటి నుంచి పారిపోతాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందనే ఆసక్తికర విషయాలతో సినిమాను రూపొందించారు.






