calender_icon.png 27 September, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల వివరాలను వేగవంతంగా నమోదు చేయాలి

27-09-2025 01:00:12 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పి ఎం ఏ వై జి సర్వే యాప్ లో వివరాల నమోదు  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లాలోని  గృహ నిర్మాణ శాఖ  డిఇ, ఏఇలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ పిఎంఏవైజి సర్వే యాప్‌లో ఈనెల 30లోగా వివరాలు నమోదు  చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల మార్కౌటును వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మార్క్ అవుట్ అయిన ఇండ్ల నిర్మాణంలో పురోగతి తీసుకు వచ్చి  త్వరితగతిన  పూర్తి చేయాలని, పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల వివరాలను ఏఈ,డిఈ స్థాయిలో పెండింగ్ లో లేకుండా హౌజింగ్ పీడీకి  పంపాలన్నారు.

ఇసుక ఇబ్బంది లేకుండా చూడాలని, ఇందిరమ్మ ఇండ్ల  విషయంలో  ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండ నిర్మాణం పూర్తి చేయాలని, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని పంచాయతీ సెక్రెటరీలను, హౌజింగ్ ఏఈ లను ఆదేశించారు. ఈ కాన్ఫెరెన్స్ లో హోజింగ్ డి ఇ సిదార్ధ,  ఇన్స్పెక్టర్  అబ్దుల్ల తదితరులు పాల్గొన్నారు.