27-09-2025 12:59:38 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): నిషేధిత నల్లబెల్లం, నాటు సారా తయారీకి వినియోగించే పటిక ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నుండి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు అక్రమంగా అశోక లేలాండ్ వాహనంలో తెస్తుండగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేతరాజు పల్లి శివారులో నెల్లికుదురు పోలీసులు పట్టుకున్నారు. 60 బస్తాల నల్ల బెల్లం, రెండు బస్తాల పటిక వాహనంలో ఉందని, 3 లక్షల 10 వేల విలువైన బెల్లం, పటిక , లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్ ఐ చిర్రా రమేష్ బాబు తెలిపారు.