calender_icon.png 27 September, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలివ్వాలి

27-09-2025 01:03:10 AM

కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా     

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 26: గ్రామపంచాయతీ కార్మికులను పండగపూట పస్తులతో ఉంచొద్దని 3 నెలల వేతన బకాయిలను వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని లేకపోతే సమ్మె లోకి వెళ్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల వేతన బకాయిలు విడుదల చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పండుగలు వస్తున్నాయని ఇప్పటికే మూడు నెలల వితనాలు పెండింగ్ లో ఉన్నాయని మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులు మూడు నెలలుగా అప్పులు అప్పులు చేసి ఆర్థిక సమస్యలతో కుటుంబాలు గడవక అర్ధాలతో అలమటిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గుడ్డి గుర్రం పండ్లు తోముతుందా అని ప్రశ్నించారు.ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్స్ తో పాటు ఇతర పార్ట్ టైం వర్కర్స్ కూడా వేతనాలు  ఇవ్వాలని అన్నారు. లేకపోతే పనులు బంద్ పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్న అంజయ్య, నాయకులు పగిడిమరి సర్వయ్య,ఎండి జహీర్,ఎర్ర అరుణ, ఏర్పుల సైదులు, కంచర్ల జానయ్య, కొండేటి నరసయ్య, అలివేలు, సైదులు, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.