13-01-2026 10:20:04 AM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మల్కపేట సర్పంచ్ బోయిని దేవరాజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తన నియామకానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి సహకరించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట మండలంలోని సర్పంచులు అందరికీ దేవరాజు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మరియు జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు ఎదుర్కొంటున్న పెండింగ్ బిల్లులు నిధుల కొరత వంటి అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గత కాలంగా పరిష్కారానికి నోచుకోని సర్పంచుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మండల అభివృద్ధి పథంలో సర్పంచులు ఉప సర్పంచులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫిరోజ్ పాషా రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.