22-01-2026 03:54:53 PM
దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్
దేవరకొండ జనవరి 22 విజయ క్రాంతి: దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన స్పింక్లర్స్ ను రైతులకు పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ స్పిన్కర్లు పంచిన అనంతరం వారు మాట్లాడుతూ రైతులని అభివృద్ధి దిశగా పయనించే మార్గం కాంగ్రెస్ పార్టీ తీసుకుందని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వస్తున్నారని రానున్న రోజులలో రైతులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోదేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయని జమున మాధవ రెడ్డి మాజీ జడ్పీటీసీ గుంజ నారాయణ రేణుక మండల పార్టీ అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ వంకూడవత్ పాప నాయక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చిరెడ్డి రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.