22-01-2026 04:27:29 PM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao)కు ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team)నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు కేటీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ ముందు హాజరై, ఉదయం 11.25 గంటల నుండి ఏడు గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న రెండు రోజుల తర్వాత సిట్ ఈ చర్య తీసుకుంది. నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసును అందజేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ పై సిట్ విచారించింది.