calender_icon.png 22 January, 2026 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిపై అదనపు భారం పాపం ఎవరిది?

22-01-2026 05:02:28 PM

హైదరాబాద్: గడిచిన పదేళ్లు సింగరేణిలో(Singareni)దోపిడి జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలోనూ అదే దోపిడీ జరుగుతుందని ద్వజమెత్తారు. సింగరేణి అనేది కార్మికుల ఆస్తి అన్నారు. 12 ఏళ్లలో రూ. 47వేల కోట్లను కార్మికులకు ఇవ్వాల్సి ఉందన్నారు. సింగరేణిపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఎప్పుడూ లేదని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు.

సింగరేణిపై ప్రభుత్వాలు అదనపు భారాన్ని మోపుతున్నారని పేర్కొన్నారు. సింగరేణిపై అదనపు భారం పాపం ఎవరిది?, ప్రెస్ మీట్ లో అడ్డంగా మాట్లాడటం కాదు? అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి విద్యుత్ వాడుకుని జెన్ కో, ట్రాన్స్ కో డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా లెటర్ రాయించిందని చెప్పారు. నైనీ బ్లాక్ ను ప్రైవేట్ వారికి ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నైనీ బ్లాక్ టెండర్లను బీఆర్ఎస్ కూడా రద్దు చేసిందని తెలిపారు.