calender_icon.png 22 January, 2026 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీ నోటీసులకు భయపడం, వెంటపడతాం

22-01-2026 04:49:11 PM

హైదరాబాద్: సిట్ ఎన్ని నోటీసులు(SIT notices) ఇచ్చినా భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) స్పష్టం చేశారు. ''నీ నోటీసులకు భయపడం, వెంటపడతాం'' అన్నారు. మెదక్ జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... వంద పడకల ఆస్పత్రి కట్టాం, మెడికల్ కాలేజీ తెచ్చామని హరీశ్ రావు అన్నారు. మెదక్ లో ఇంటింటికీ మంచినీళ్లిచ్చాం, రైలు తెచ్చామని వివరించారు. రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో ఒక్కటి చూపించాలని సవాల్ చేశారు.

బీఆర్ఎస్ టైంలో మెదక్ మున్సిపాలిటీకి రెండో స్కోచ్ అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. మొన్న తనకు, ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామనే నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. సీఎం బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే తనకు నోటీసులు ఇచ్చినట్లు విమర్శించారు. దమ్ముంటే బొగ్గు స్కాంపై సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేటీఆర్ కు గురువారం నోటీసు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసును అందజేశారు.