అభివృద్ధి మన సంకల్పం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 9 (విజయ క్రాంతి) : అభివృద్ధి మన సంకల్పమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణం లోని పాత తోట దగ్గర రూ రెండు కోట్లతో నిర్మించిన మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం వార్డు నెంబర్ 25 , గోల్ మజీద్ ప్రాంతంలో తెలంగాణ అర్బన్ ఫై నాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో నిర్మించనున్న బాక్స్ డ్రైనేజీ ని ర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణం లోని గోల్ మజీద్ నుంచి రైస మజీద్ వరకు రూ 4కోట్ల తో బాక్స్ డ్రైనేజీ నిర్మా ణం చేస్తున్నామని తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, వారి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ మహబూబ్ నగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఒక్క సంవత్సరంలోనే రూ 250 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, అందులో కొన్ని ఇప్పటికే పూర్తి చేసుకోగా, మరి కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ ను మరింత అభివృద్ధి చే స్తామని ఆయన స్పష్టం చేశారు.రానున్న 3 సంవత్సరాల్లోకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను అద్బుతంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చే శారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చై ర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , ఫైయాజ్, లీడర్ రఘు, మో యీజ్,ఉమర్ అఫీజ్, మహ్మద్ జియా, ముజాహిద్, జుబేర్, జహంగీర్, పాషా, మోయిన్, అంజ ద్, మహబూబ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






