13-07-2025 10:20:00 PM
నాగారం: మండల కేంద్రానికి చెందిన జిల్లా ప్రాదేశిక మాజీ సభ్యురాలు కడియం ఇందిరా పరమేశ్వర్ కుమార్తె కడియం నివేదిత హైదరాబాదులోని నల్సార్ యూనివర్సిటీ(Nalsar University of Law) ఎల్ఎల్ఎం పూర్తి చేసింది. నల్సార్ యూనివర్సిటీ నిర్వహించిన 22 స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ పి నరసింహ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. ప్రస్తుతం నివేదిత తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంది. పలువురు గ్రామస్తులు అభినందించారు.