13-07-2025 10:25:11 PM
బీసీ రిజర్వేషన్లపై దీర్ఘకాలికంగా పోరాటం చేస్తాం..
పార్టీలకతంగా బీసీలు ఏకం కావాల్సిందే..
భద్రాచలం బీసీల సమర శంకరావం సభలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్..
భద్రాచలం (విజయక్రాంతి): మెజార్టీగా ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు కరివేపాకు లాగా వాడుకుని, తరతరాలుగా బీసీలను రాజకీయంగా దగా చేస్తున్నారని, ఇక ఇది ఎంతో కాలం సాగదని బీసీలలో రోజురోజుకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ వాదం బలపడిందని ఇక బీసీలంతా ఒక్కటై రాజకీయంగా యుద్ధం మొదలు పెట్టడటంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ప్రారంభమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్(BC Welfare Association National President Jajula Srinivas Goud) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శుభం గార్డెన్ లో ఆదివారం జరిగిన బీసీల శంఖారావం సభకు ముఖ్యఅతిథిగా పాల్గొనగా, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు(MLA Tellam Venkata Rao) విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సభకు బీసీ ఐక్యవేదిక భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రం రాకముందు రాష్ట్రము వచ్చిన తర్వాతే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం జనాభా దామశ ప్రకారం దక్కడం లేదని 60 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సింది చోట నేడు 18 కూడా లేకపోవడం, అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఒక్క బీసీ శాసనసభ్యులు, ఒక్క బీసీ పార్లమెంట్ సభ్యులు, ఒక్క బీసీమంత్రులు లేకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు. బీసీలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కే వరకు గల్లి నుంచి ఢిల్లీ వరకు రాజకీయ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 42 శాతం రిజర్వేషన్లు పెంచడాని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచితే కొన్ని రాజకీయ పార్టీలు కడుపుమంటతో వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను వేదికలుగా చేసుకుని బీసీల నోటికాడు ముద్దను గుంజేసుకోవాలని చూస్తున్నారని దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% అమలు జరిగే వరకు తమ పోరాటం ఉంటుందని, బీసీ రిజర్వేషన్లకు ఎవడు అడ్డు వచ్చినా ఇక తొక్కుకుంటూ పోవడం కాయమని అని ఆయనే హెచ్చరించారు. బీసీలు రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘటితమై ఓటు బ్యాంకుగా ఏర్పడి ఓటు మనదే సీటు మనదే అనే నినాదంతో, మేమెంతో -మాకంతనే హక్కుతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 60 మంది బిసి ఎమ్మెల్యేలను, 9 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని బీసీల సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు జనరల్ స్థానాలలో కూడా పోటీ చేయాలని, జనరల్ స్థానంలో పోటీ చేసిన బీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత బీసీ సంఘాలు తీసుకుంటాయని ఆయన తెలిపారు. భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ.. బీసీలకు తాను అండగా ఉంటానని రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తానని ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచినట్లు తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు పెంపులో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని, ఏజెన్సీ ప్రాంతాలలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా మంత్రులు అధికారులతో మాట్లాడి న్యాయం చేయడానికి కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తటికొండ విక్రమ్ గౌడ్, కనకల శ్యాం కురుమ, భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అంకినీడు ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ బుర్ర సోమేశ్వర్ గౌడ్, కుడికేలా సమ్మయ్య, కార్యనిర్వాక అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు మీనాక్షి, బీసీ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి బండారు నాగేశ్వరరావు, తంబళ్ల వెంకటేశ్వరరావు, తాళ్ల రవికుమార్, శాంతారావు, మల్లు బాబు యాదవ్, ఆలేటి నాగేశ్వర చారి, జీ వెంకటేశ్వర్లు, సరిత గౌడ్ పద్మప్రియ, రాధ దేవకి నాగమణి తో పాటు వందలాది మంది బీసీ సంఘాల శ్రేణులు పాల్గొన్నారు.