calender_icon.png 14 July, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిఫ్ట్ చైర్మన్ ఎన్నికకు రైతులందరూ హాజరుకావాలి..

13-07-2025 10:29:12 PM

జైపాల్ రెడ్డి..

మునగాల: నాగార్జునసాగర్ ఎడమ కాలువ మండల పరిధిలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ ఎన్నికను బుధవారం మండల కేంద్రంలో స్థానిక రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నది కావున రైతులు సహకాలంలో హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి(Congress Party Mandal President Koppula Jaipal Reddy) తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూచన మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ ఎన్నిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

రైతులు సాగు చేసే పంటలకు నీళ్లు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు నిరంతరం పర్యవేక్షించేందుకు ఇరిగేషన్ కమిటీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ము ఈదారావు, మాజీ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, ఎండి రషీద్, కాసర్ల శ్రీను, చింతకాయల నాగరాజు, శెట్టి గిరి, కాసర్ల వెంకట్, మండవ శ్రీను, కొండ రామాంజి, దేవినేని రవి, సిరికొండ చందు, పసుపులేటి గోపి తదితరులు పాల్గొన్నారు.