calender_icon.png 14 July, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సీతారామ’ నుంచి నీటి విడుదల

13-07-2025 12:38:16 AM

- ఫలించిన మంత్రి తుమ్మల కృషి

- సంతోషం వ్యక్తం చేస్తున్న ఖమ్మం రైతులు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 12 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మొద టి లిఫ్ట్ పంపుహౌస్ నుంచి  సాగర్ ఆయకట్టుకు శనివారం అధికారులు నీటిని విడుదల చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ఫలించడంతో ఖమ్మం జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు సకాలం లో పడక, సాగునీరు అందక నారుమల్లు, పొలాలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల విజ్ఞప్తితో రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని ఉమ్మడి ఖమ్మంలోని జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టుకు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ను కోరారు. శనివారం కలెక్టర్లతో తుమ్మల సమావేశమయ్యారు. తుమ్మల విజ్ఞప్తితో స్ప ందించిన మంత్రి ఉత్తమ్.. రైతాంగ అవసరాలు దృష్ట్యా తక్షణమే నీటి విడుదలకు నిర్ణయం తీ సుకున్నారు.

ఈ మేరకు అధికారులు శనివారం సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చే శారు. దీంతో సాగర్ ఆయకట్టు పరిధిలో వైరా, సత్తుపల్లి, వర్షదారం మీద ఆధారపడిన అశ్వరావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజక వ ర్గాల పరిధిలోని లక్షలాది ఎకరాలకు గో దావరి జలాలు అందించి తుమ్మల ఊపిరి పోశారు.