calender_icon.png 6 December, 2024 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి

30-10-2024 01:23:45 AM

రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్లగొండ, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : రహదారుల నిర్మాణం, విస్తరణతోనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కనగల్ మండలం పగిడిమర్రి శివారులో సోమన్న వాగుపై రూ.38 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెనతో పాటు పలుచోట్ల రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు.

రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణానికి రూ. 600 కోట్లు కేటాయించామన్నారు.

బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయని, అది పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సెల్బీసీ సొరంగాన్ని రెండేళ్లలో పూర్తిచేసి నల్లగొండ జిల్లాలో కరువును శాశ్వతంగా రూపుమాపుతామన్నారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి నిర్వహించి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.