calender_icon.png 9 January, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి హక్కులు సాధిస్తాం

08-01-2026 01:32:03 AM

  1. బలమైన వాదనలు వినిపిస్తాం
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, జనవరి 7 (విజయక్రాంతి): కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులు సాధిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్ట నీటి హక్కులను సుప్రీంకోర్టు, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం వద్ద బలమైన వాదనలు వినిపించి సాధిస్తామని చెప్పారు. హుజూర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను, హుజూర్‌నగర్ పట్టణంలో ప్రభు త్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలను, రోడ్లు, భవనాల గెస్ట్ హౌస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్, నీటిపారుదల శాఖ కార్యాలయ పనులను బుధవారం మంత్రి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్ధ శతాబ్దానికి పైగా సేవలు అందించేలా ప్రభుత్వ కార్యాలయాలు నాణ్యతతో నిర్మించనున్నట్లు తెలిపారు.  రామ స్వామి గుట్ట వద్ద నిర్మించిన 2,160 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి గురువారం నుంచి పది రోజులు పాటు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలలో కేటాయిస్తామన్నారు. దీంతో 15 ఏళ్ల నా శ్రమ కు ఫలితం త్వరలో దక్కబోతుందన్నారు.

అనంతరం హుజూర్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో హుజూర్‌నగర్, మేళ్లచెరువు, చిం తలపాలెం, మఠంపల్లి, పాలకవీడు నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల లబ్ధిదారులకు రూ. 1.71 కోట్ల విలువ చేసే కళ్యాణలక్ష్మి చెక్కులను మం త్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం, టీజీ ఈడబ్ల్యు ఐడిసిడిఈ రమేష్ పాల్గొన్నారు.