16-11-2025 05:35:06 PM
మహాసభ సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్లు..
తుంగతుర్తి (విజయక్రాంతి): ఆర్యవైశ్యులు ఐక్యతగా ఉండి అన్ని రంగాలలో రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం కార్తీక వన మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘ అధ్యక్షులుగా ఈగ నాగన్న ప్రధాన కార్యదర్శుల గుండా శ్రీనివాస్ కోశాధికార మాశెట్టి వెంకన్నలకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
అనంతరం మహిళా సంఘం అధ్యక్షులుగా గుమ్మడవెల్లి అరుణ ప్రధాన కార్యదర్శిగా ఓరుగంటి అనూష, కోశాధికారి గోపారపు ఇందిర, యువజన సంఘం నూతన కమిటీలో అధ్యక్షులుగా సంతోష్, ప్రధాన కార్యదర్శిగా రమేష్ కోశాధికారిగా నిరంజన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య ,గుమ్మడవెల్లి సోమయ్య, ఈగ లక్ష్మయ్య ఓరిగంటి శ్రీనివాస్ గోపారపు సత్యనారాయణ ఓరుగంట అంతయ్య, గుమ్మడవెల్లి శ్రీను, మండల ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.