calender_icon.png 16 November, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రన్ ఫర్ సోషల్ జస్టిస్

16-11-2025 05:37:59 PM

వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం మార్నింగ్ వాకర్స్ తో వలిగొండ కొత్త బస్టాండ్ నుండి హైస్కూల్ వరకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.