14 July, 2026 | 3:29 PM

Breaking News

చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •  

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

26-06-2025 08:14 PM

కోదాడ సహకార సంఘాన్ని సందర్శించిన టెస్కాబ్ అధికారులు..

కోదాడ: వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు వాణిజ్య బ్యాంకులకు దీటుగా అన్ని రకాల రుణాలు మంజూరు చేసి సహకార సంఘాలు అభివృద్ధిలో ముందుండాలని టెస్కాబ్ అధికారులు విజయ శంకర్, సంపత్ కుమార్ లు తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని శిక్షణలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న పిఎసిఎస్ ఉద్యోగులతో కలిసి సందర్శించారు. చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం కోదాడ సంఘం నిర్మించిన గోదాములను పరిశీలించారు. డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య, చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బుడిగం నరేష్, ఏజిఎం పి వెంకటేశ్వర్లు, మేనేజర్ అశోక్, ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్లు గుండా పునేని ప్రభాకర్ రావు, పార్వతి, సీఈఓ మంద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.