3 April, 2026 | 2:41 AM

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

03-04-2026 12:54 AM

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నల్లకుంట డివిజన్లోని వెజిటేబుల్ మార్కెట్ పరిసరాల్లో రూ. 1 కోటి తో సిసి రోడ్ల నిర్మాణ పనులను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాజీ కార్పొరేటర్ అమృతతో కలిసి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంతో కాలనీవాసులు, మార్కెట్ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాలనీవాసులు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.