17-10-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్, అక్టోబర్ 16 : విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేటలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్‌తో,తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలు ర పాఠశాల, సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురో గతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు. అలాగే కోటపల్లి మండలంలో తెలంగాణ సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల తహసిల్దార్ రాఘవేందర్ రావు, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.