16-10-2025 11:33:15 PM
తహసీల్దార్ లాలునాయక్
పెన్ పహాడ్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ లాలూ నాయక్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని అనంతారం, నారాయణ గూడెం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చెర్మెన్ నాతల జానకి రాంరెడ్డి తో కలసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యం కాంటా అయిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.
రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రహించి ఏ గ్రేడ్ కు రూ.2,389, బీ గ్రేడ్ కు రూ.2,369 మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగకుండా తగిన వసతులు కల్పించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సి.ఈ ఓ అలకుంట్ల సైదులు, వైస్ చైర్మన్ మామిడి శ్రీనివాస్, జగదీష్ రెడ్డి , పుల్లారెడ్డి మేకల శ్రీను. లక్కపక్క అలివేలు, సైదులు నారాయణ రెడ్డి, సామ సురేందర్ రెడ్డి, షేక్ మల్సూర్, బైరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గజ్జల ధర్మ రెడ్డి, పగిళ్ళ ఆంజనేయులు, మామిడి చిన్ని, మామిడి కిరణ్, చిట్టపు వీరారెడ్డి, పొంతటి లక్షమ్మ రెడ్డ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు